యువతి మెదడులో 10 సెం.మీ నులిపురుగు

బీజింగ్‌ : 23 ఏళ్ల యువతి మెదడులో 10 సెంటీమీటర్ల పొడవైన నులిపురుగు బయటపడింది. ఈ సంఘటన చైనాలోని నింజియాంగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నింజియాంగ్‌కు చెందిన క్షియావో ఇ అనే యువతి గత కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. ఈ మధ్య ఎపిలిప్సీ( న్యూరలాజికల్‌  డిజార్డర్‌) అటాక్‌ చేసింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. క్షియావోకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మెదడులో ఇన్ఫెక్షన్‌‌ సోకినట్లు గుర్తించారు. ఆ వెంటనే శస్త్ర చికిత్స మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె మెదడులో ఉంటున్న 10 సెంటీమీటర్ల నులిపురుగు వారు గుర్తించి, దాన్ని బయటకు తీశారు. సరిగా ఉడకని మాంసం తిన్నందు వల్లే నులిపురుగు ఆమెలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ( చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..)