శాసనసభ: విమర్శలను తిప్పికొట్టిన హరీష్‌రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పద్దులు మాత్రమే చెప్పేవని, అభివృద్ధి అనే మాటే రాష్ట్రం ఎరుగలేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌రావు శాసనసభలో గురువారం మాట్లాడారు. 




కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో కరెంట్‌ కోతలు, వారానికి మూడు రోజులు పవర్‌ హాలిడే ఉండేదని.. తమ ప్రభుత్వం విద్యుత్‌ సమస్యలు పూర్తిగా పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు, రైతులకు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. రైతాంగానికి 24 గంటల కరెంటుతోపాటు పెట్టుబడి సాయంగా రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. ‘కరెంటు బందు ప్రభుత్వం మీది.. రైతు బంధు ప్రభుత్వం మాది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.