పరిస్థితులు అలా మార్చాయి: తాప్సీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను ఇటీవల నటించిన ‘థప్పడ్‌’ సినిమా విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని.. అమృత పాత్రలో ఒదిగి అందరిని ఆకర్షించారంటూ తాప్సీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు. ఇక తాజాగా తాప్సీ చీరలో ఉన్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోకి ‘నేను ధైర్యంగా ఉన్నాను.. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిరాడంబరంగా ఉన్నాను.. ఎందుకంటే.. నేను నిరాశను ఎదుర్కొన్నాను.  బలవంతురాలిని.. ఎందుకంటే పరిస్థితులు నన్ను అలా మార్చాయి. కృతజ్ఞతతో ఉన్నాను ఎందుకంటే నష్టాన్ని తెలుసుకున్నాను. ఇక నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అంటూ స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.(భారత సినీ చరిత్రలో ‘థప్పడ్‌’ మైలురాయి)